గత కొన్ని రోజులుగా లేడి ఒరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకసలు ఈ విషయంలో ఎదురేలేదనుకుంది నయనతార. అయితే వరసపెట్టి లేడి ఒరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది సమంత. పెళ్లయ్యాకా సమంతకు రొటీన్ కమర్షియల్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఆ అవకాశాన్ని ఆమె నటిగా తన స్థాయిని పెంచుకునేందుకు ఉపయోగించుకుంటూ ఉంది. తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలనే ఎంపిక చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో సమంత వరసగా హిట్స్‌ని కూడా అందుకుంటోంది. ఈ విషయంలో మజిలీ, యూ టర్న్, ఓ బేబి ఉదాహరణ. కమర్షియల్ గా ఆ సినిమాలు సూపర్ హిట్. అంతేకాదు ప్రశంసలకు ఏ మాత్రం లోటు లేదు. ఈ నేపథ్యంలో సమంత అలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి రెడీ అయిపోతూ ఉందని స్పష్టం అవుతోంది. ఆ విషయాన్ని సమంత కూడా స్వయంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నయనతార చేయాల్సిన ఒక సినిమా సమంత వైపు టర్న్ తీసుకుందని లేటెస్ట్ న్యూస్. ఇదివరకూ తమిళంలో వచ్చిన 'అరమ్' సినిమాకు సీక్వెల్ లో సమంత నటించబోతోందని సమాచారం. 
తెలుగులో 'కర్తవ్యం' పేరుతో విడుదల అయిన ఆ సినిమాకు సీక్వెల్ ప్రతిపాదన ఉంది. ముందుగా నయనతారే అందులో నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సమంతకు ఆ అవకాశం దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. నయనతార ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తనే ప్రధాన పాత్రను చేస్తూ పలు సినిమాలను లీడ్ చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సమంత నుంచి ఆమెకు పోటీ ఎదురవుతున్నట్టు అర్థమవుతుంది. ఒకవేళ ఇదేగనక జరిగితే సమంత నయనతారకు చెక్ పెట్టినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: