రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న హిస్టారిక‌ల్ మూవీ ఆర్ ఆర్ ఆర్‌. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ.దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ కంటిన్యూగా జ‌రుగుతోంది. టాలీవుడ్ యంగ్‌స్ట‌ర్స్ రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ సెట్ చేయ‌డంతోనే రాజ‌మౌళి స‌గం స‌క్సెస్ అయ్యాడు.


కొమ‌రం భీంగా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అవ్వ‌డంతో ఇప్పుడు ఈ సినిమాపై నేష‌న‌ల్ వైడ్‌గా అంతే క్రేజ్ ఉంది. వచ్చే ఏడాది జులై 30 రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఆ డేట్ ఎప్పుడు వ‌స్తుందా ? అని కోట్లాది మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు.


వీళ్ల వెయిటింగ్ ఇలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమాలో త‌మ అభిమాన హీరో ప‌క్క‌న న‌టించే హీరోయిన్ ఎవ‌రో తెలియ‌క టెన్ష‌న్‌తో చ‌చ్చిపోతున్నారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడి ఎవరో ఇంకా తేలనే లేదు. యంగ్ టైగర్ ఫాన్స్ సస్పెన్సు భరించలేకపోతున్నారు. 


ఎన్టీఆర్ ప‌క్క‌న ముందుగా విదేశీ హీరోయిన్ డైసీని తీసుకున్నా ఇప్పుడు ఆమె త‌ప్పుకోవ‌డంతో ఆమె కోసం స‌రైన జోడీని వెతికే ప‌నిలో రాజ‌మౌళి బిజీగా ఉన్నాడు. రాజ‌మౌళి త్వ‌ర‌గా ఎన్టీఆర్ హీరోయిన్‌ను వెతికి అఫీషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసే వ‌ర‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ టెన్ష‌న్ త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: