ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ మరియు వీక్షకుల ఆదరణతో దూసుకుపోతున్న షోల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇక ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో, మూడవ సీజన్ ప్రస్తుతం ప్రసారానికి సిద్ధం అవుతోంది. ఇక ఈ నూతన సీజన్ ఈనెల మూడవ వారంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంటున్నారు. అయితే ఈ సీజన్ కు మన్మధుడు నాగార్జున హోస్ట్ గా రాబోతున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ పై మాత్రం ఇప్పటివరకు బిగ్ బాస్ టీమ్ నుండి ఎటువంటి ప్రకటన లేదు. దానితో కొన్ని మీడియా మాధ్యమాల్లో వీరే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్స్ అంటూ పలువురి పేర్లు చాలా రోజుల నుండి ప్రచారం అవుతున్నాయి. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సీజన్లో యాంకర్లు అనసూయ, లాస్యలతో పాటు మరొక ఫేమస్ యాంకర్ అనసూయ పాల్గొంటోంది అంటూ నేటి ఉదయం నుండి వార్తలు పుకారవుతున్నాయి. 

అంతేకాక ఈ సీజన్ షూటింగ్ కోసమే అనసూయ తన టెలివిజన్ మరియు సినిమా షూటింగ్స్ ని వాయిదా వేసుకున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలు బయటకు రాకుండా ఆమె ఎంత జాగ్రత్తపడినప్పటికీ ఆమె సన్నిహితులు కొందరు ఈ వార్తను బయటకు లీక్ చేసారని అంటున్నారు. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమే అయితే మాత్రం అనసూయ ఫ్యాన్స్ కు పండుగే అంటున్నారు విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: