కంగనా రనౌత్‌.. అతి పేద కుటుంబం వచ్చి, బాలీవుడ్ లో జెండా పాతిన టాలెంట్ ఆమె సొంతం. నటిగా మంచి పేరు సంపాదించి.. ఇమేజ్, మార్కెట్ సంపాదించుకున్నాక ఆమె హొయలు మామూలుగా లేవు. ఉన్నదున్నట్లు మాట్లాడేసే కంగనా ఒకప్పుడు జనాలకు నచ్చేది. ఆమె మాటలు జెన్యూన్‌గానే అనిపించేవి. కానీ అదే పనిగా కొందరిని టార్గెట్ చేయడం, తన సినిమాల విడుదలకు ముందు కాంట్రవర్శీలు రాజేయడం చూశాక ఆమె ఉద్దేశాలపై అనుమానాలు రేకెత్తాయి.

 

ఈ మధ్య కంగనా, ఆమె సోదరి రంగోలి కలిసి బాలీవుడ్లో ఎవరిని పడితే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. అవసరం లేని వ్యవహారాల్లోకి జొరబడి అందరినీ ఇరిటేట్ చేస్తున్నారు. ఎవరైనా వీళ్ల వ్యాఖ్యల్ని ఖండిస్తే మరీ బ్రూటల్‌గా ఎటాక్ చేస్తూ వాళ్లను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కంగనాను అభిమానించే వాళ్లకు సైతం ఆమె అంటే నచ్చట్లేదు. బాలీవుడ్లో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కంగనాను అవాయిడ్ చేస్తున్నారు.

 

దీంతో కంగనా ఫ్రస్టేషన్ ఇంకా పెరిగిపోతోంది. కానీ ఆమె ఎంత అతి చేస్తే అంతగా నష్టం జరుగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఏ పేరున్న దర్శకుడు, నిర్మాత కంగనాతో సినిమా చేసే పరిస్థితి లేదు. టాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడితో కంగనా సినిమా చేస్తుందని ఎవరైనా అనుకున్నారా? కానీ ‘జడ్జిమెంటల్ హై క్యా’ అనే సినిమా చేసింది.

 

దీని తర్వాత సోహైల్ మక్లాయ్ అనే పేరులేని దర్శకుడితో ‘పంగా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆపై రజనీష్ ఘాయ్ అనే మరో దర్శకుడితో ‘ధాకడ్’ అనే సినిమాను లైన్లో పెట్టింది. ఈ దర్శకుల పేర్లు పెద్దగా ఎవరికీ తెలియవు. రెండు చిత్రాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్లు కూడా అంత పేరు లేని వాళ్లే. ఏది ఏమైనా, ఆమె స్టార్ డమ్ ని ఆపడం ఎవరి తరమూ కాదు అని సినీ పండితుల వాదన!


మరింత సమాచారం తెలుసుకోండి: