టెలివిజన్ ప్రేక్షకులను జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్న హాట్ యాంకర్ అనసూయ మరోపక్క సినిమాలు కూడా చేస్తోంది. రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ కి మంచి పేరు వచ్చింది.


దీంతో వరుస అవకాశాలు ఇండస్ట్రీలో అనసూయా కి వస్తున్న క్రమంలో సినిమాలు చేస్తూనే మరో పక్క జబర్దస్త్ షోలలో యాంకరింగ్ చేస్తోంది. కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో అనసూయ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా తాను నిర్మాతగా మారబోతున్నట్లు అనసూయ ప్రకటించింది. కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు తాను సినిమాలు నిర్మిస్తానని అనసూయ తెలిపింది. అనసూయ సినిమాలు నిర్మించే ఆలోచనని భవిష్యతులో అమలు చేస్తుందా లేక ప్రస్తుతం ఏదైనా ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: