సమంత 'ఓ బేబీ' చిత్రం తాజాగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ కూడా ఈ చిత్రంకు వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంకు అన్ని ఏరియాల నుండి మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఈ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా రానా పాల్గొన్నాడు. ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ.. నేను మామూలుగా వీకెండ్స్ అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కు ఫోన్ చేసి సినిమా వసూళ్లను అడిగి తెలుసుకుంటూ ఉంటాను. ఈ సినిమా వసూళ్ల గురించి వారు చెబుతూ చివర్లో బాబు ఈ సినిమా మీ సినిమా కంటే కూడా బాగా ఆడేస్తుందని అన్నారు.

 

మా నాన్నకు నేను సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని కోరిక. కాని నాకు అంత ట్యాలెంట్ లేదు.. ఒక్క సినిమాకే మూడు సంవత్సరాలు పడుతుంది. సమంత నీ పిచ్చకు ఓ అడ్రస్ దొరికేసింది. నీకు ఇష్టం వచ్చినన్ని సినిమాలు ఇక్కడ చేసేసుకోవచ్చు అన్నాడు. ఈ సినిమాకు పని చేసిన సునీత గారు.. నందిని రెడ్డి మరియు సమంతలు ఒక మంచి వేదిక మీదకు వచ్చి ఈ చిత్రాన్ని చేశారు.

 

ఒక మహిళ గురించిన ఎమోషన్స్ ను ఈ చిత్రంలో ఈ మహిళలు చాలా చక్కగా చూపించారు. సునీత నేను నటుడిని కొన్ని సినిమాలు చేశాను.. డైలాగ్స్ చెప్పగలను. నాకు ఏమైనా కొరియన్ సినిమాలు ఉంటే చెప్పండి తప్పకుండా చేద్దాం అంటూ స్టేజ్ పై ఉన్న అందరిని నవ్విస్తూ సరదాగా జోకులు వేస్తూ సినిమా యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలియజేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: