ఆనాటి హాలీవుడ్‌ 'గాడ్‌ఫాదర్‌ ' చూడక పోతే, రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్టర్‌ అయ్యేవాడా...? విదేశీ సినిమాలను అనుకరించడం తెలుగు పరిశ్రమలో ఎప్పటి నుండో, ఉన్నదే.. ఇటీవలి బాలీవుడ్‌ సినిమా 'భారత్‌'ని కూడా, ఒక విదేశీ సినిమాను స్వదేశీకరణ చేసి రూపొందించారు. అయితే కాపీ కొట్టకుండా అధికారికంగా హక్కులు కొనుగోలు చేసి ఆ సినిమాను రీమేక్‌ చేశారు.

ఇక తెలుగులో ఈ వారంలో విడుదల అయి, సమీక్షల్లో టాప్‌ రేటింగ్‌లో ఉన్న 'ఓహ్‌ బేబీ' సినిమా కూడా కొరియన్‌ సినిమా 'మిస్‌ గ్రానీ'కి రీమేక్‌ అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచ సినిమా రంగంలో ఇరాన్‌, కొరియా సినిమాలు అద్భుతంగా ఉంటాయని , ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో పరిశీలకులు అంటుంటారు.

సాధారణంగా మనోళ్లు కాపీ కొట్టే సినిమాల్లో కొరియన్‌ భాషవి కూడా ముందుంటాయి. సౌత్‌ కొరియాలో హిట్‌ అయిన ఎన్నో సినిమాలను ఇండియన్‌ ఫిల్మ్‌మేకర్స్‌ కాపీ కొట్టి తీశారు. తెలుగులో అయితే నాని హీరోగా నటించిన 'పిల్ల జమీందార్‌' ఆ మధ్య వచ్చిన 'నెక్ట్స్‌ నువ్వే' వంటి సినిమాలన్నీ అలా తీసినవే... .

ఇలా డైరెక్టుగా కాపీకొట్ట కుండా స్వల్ప మార్పుగా అధికారికంగా 'మిస్‌ గ్రానీ'రైట్స్‌ను కొనుగోలు చేసి రీమేక్‌ చేసి తీసిన సినిమా 'ఓహ్‌ బేబీ'. కాపీ కాకుండా.. అధికారికంగా హక్కులు కొనుగోలు చేసి రూపొందించడం, సినిమా మేకర్ల నిజాయితీని చాటుతుంది.

కానీ ,ఒక పాట విషచయంలో మాత్రం సినీ విమర్శకులకు దొరికి పోయారు ఆ సినిమా టీమ్‌. ' ఓ బేబీ..ఓ బేబీ టైటిల్‌ సాంగ్‌ వింటుంటే ఎక్కడో విన్నట్టుందే.. అనిపించింది. చివరికి పట్టేశాను, హారీస్‌ జేరాజ్‌ 'వాసు' నుంచి 'ఓ ప్రేమా.. ఓ ప్రేమా..' పాటలో బిట్‌ తీసుకుని మిక్కీ మేయర్‌ మక్కీకి మక్కీ దించేశాడు.... ' అని ఓ సినీ విశ్లేషకుడు అంటున్నారు. కావాలంటే మీరూ వినండి...లింక్‌ ఇదిగో...

https://wynk.in/u/THReuMxo1

మరింత సమాచారం తెలుసుకోండి: