అర్జున్ రెడ్డి’తో దక్షిణాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ‘కబీర్ సింగ్’ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. భారీ వసూళ్లతో సాగిపోతున్న ఈ సినిమాపై క్రిటిక్స్ విమర్శలు గుప్పించడంపై ఇటీవలే ఘాటుగా స్పందించాడు సందీప్. విడుదలకు ముందు సైతం అతను ఇలాగే అగ్రెసివ్ కామెంట్లు చేశాడు. టీజర్, ట్రైలర్ చూశాక కొందరు ఫెమినిస్టులు ఈ సినిమాను విమర్శించడాన్ని అతను తప్పుబట్టాడు.

 

ఒక అమ్మాయి, అబ్బాయి డీప్ లవ్‌లో ఉన్నపుడు, వాళ్లిద్దరి ప్రేమలో నిజాయితీ ఉన్నపుడు ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకోవడం సహజమని.. ఇద్దరి మధ్య ఆ మాత్రం లిబర్టీ లేనపుడు అది ప్రేమే కాదని అన్నాడు సందీప్. ఈ వీడియోను ఇప్పుడు షేర్ చేసిన చిన్మయి.. సందీప్ వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. ఒక అమ్మాయితో డీప్‌గా కనెక్ట్ అయిన ఏ అబ్బాయీ.. ఆమెపై చేయి చేసుకోడని.. చెంపదెబ్బ కొట్టడని.. అనుమతి లేకుండా టచ్ కూడా చేయడని.. కొట్టడంలో ప్రేమ ఉందనే తప్పుడు సంకేతాల్ని సొసైటీకి ఇవ్వడం కరెక్ట్ కాదని చిన్మయి అంది.

 

తన భర్తకు, తనకు మధ్య గొప్ప అనుబంధం ఉందని.. కానీ అతను ఏనాడూ తనపై చేయి చేసుకోలేదని చిన్మయి చెప్పింది. సందీప్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అనే ఉద్దేశంతో ట్విట్టర్లో ఈ థ్రెడ్ పెట్టింది చిన్మయి. కత్తితో బెదిరిస్తూ ఒక అమ్మాయిని బట్టలు తీయాలని బెదిరించే వ్యక్తి మానసికంగా చెడిపోయినట్లే అని..

పేర్కొంది.

 

అలాగే అలాంటి వ్యక్తి కథలు కూడా సినిమాల్లో చెప్పాలని.. కానీ వాళ్లే హీరోలు అన్నట్లు గ్లోరిఫై చేయడం మాత్రం తప్పు అని చిన్మయి ‘అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్’లోని ఒక సన్నివేశాన్ని తప్పుబడుతూ మాట్లాడింది. మొత్తానికి సందీప్ వీడియో పెట్టి దాని మీద నెగెటివ్ వ్యాఖ్యలతో ఒక థ్రెడ్డే పెట్టడంతో చిన్మయి ట్విట్టర్లో పెద్ద చర్చకు తెర తీసింది. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయి వాదోపవాదాలు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: