తానా మహాసభలలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన తొలి సినిమా ఫ్లాప్ అయినప్పుడు తనకు ఇన్ని లక్షలమంది అభిమానులు ఏర్పడతారు అని భావించలేదనీ అదేవిధంగా ‘జనసేన’ ఎన్నికలలో ఓడిపోయినా ఎప్పటికైనా తన పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకు ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పైనే చర్చలు జరుగుతున్నాయి. 

ఒక సినిమా తీయడం అన్నది కేవలం ఐదు ఆరు నెలలలో పూర్తి అయిపోయే వ్యవహారం అనీ దానికి కోట్లమంది ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయాలకు ఉన్న తేడాను పవన్ ఇప్పటికీ గ్రహించ లేకపోతున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదగాలి అంటే కేవలం లక్షల మంది అభిమానిస్తే సరిపోదనీ ఆ వ్యక్తి పై కోట్లమంది ప్రజలకు నమ్మకం ఏర్పడితేనే నాయకుడు ముఖ్యంత్రి కాగలడు అన్న కనీస విషయాలు కూడ పవన్ కు తెలియవా అంటూ తానా మహాసభలకు వచ్చిన కొందరు ప్రతినిధులు చర్చించుకున్నట్లు టాక్.

ఇది ఇలా ఉండగా కొంతమంది ప్రముఖ నిర్మాతలు ఒక గ్రూపుగా ఏర్పడి పవన్ సినిమాలలో నటించాలి అని చేస్తున్న ఒత్తిడి వెనుక ఇప్పటికే పవన్ కు కోట్లాది రూపాయాలలో అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతల వ్యూహాలు ఉన్నాయి అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి. దీనితో ఒక ప్రముఖ దినపత్రిక పవన్ పై ఒత్తిడులు పెరిగిపోతున్నాయి అంటూ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. 

ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం బిజెపి స్వాగతం పలుకుతున్నా ఆ ఆహ్వానాన్ని మన్నించే స్థితిలో పవన్ లేకపోవడంతో పాటు తానా మహాసభల ప్రతినిధులు కూడ చాలామంది పవన్ ని సినిమా నటుడుగానే కొనసాగమని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం పవన్ ను మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం పవన్ ఎదో ఒక సినిమాను చేయడం తప్ప మరొక మార్గం లేదు అంటూ ఆ పత్రిక వ్రాసిన కథనం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: