వరుస విజయాల మీద ఉన్న సమయంలో నాపేరు సూర్య సినిమా ఇచ్చిన ఫ్లాప్ కి కుదేలై పోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ కెరీర్ లోనే అత్యంత దారుణంగా నాపేరు సూర్య సినిమా ఫ్లాప్ అవడంతో సక్సెస్ ట్రాక్ మీద ఉన్న బన్నీ చాలా నిరుత్సాహానికి గురి అయ్యి మరొక సినిమా మొదలు పెట్టుకోవడానికి చాలా సమయాన్ని తీసుకున్నాడు. అయితే ఈ క్రమంలో తనకు గతంలో 2 భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నాడు.


ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లుఅర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా.. తాజాగా బన్నీ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బన్నీ వ్యక్తిగత స్టాఫ్ కి సంబంధించిన ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఒక పార్టీ ఫోటో షేర్ చేశాడు. దీనిపై బన్నీ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ ఆదివారం ఉదయం లేచి చూస్తే.. శనివారం రాత్రి తన స్టాఫ్ మెంబర్స్ అందరూ పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయని.. తన కంటే వాళ్ల లైఫ్ సంతోషంగా సాగిపోతుందని అన్నారు.


చివర్లో 'నన్ను కూడా పార్టీకి పిలవొచ్చు కదా' అనే కామెంట్ జోడించాడు. మొత్తంమీద బన్నీ సొంత స్టాఫ్ వీకెండ్ సమయంలో చాలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో బన్నీకి భలే కోపం తెప్పించినటు అయ్యింది అని..సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే పెళ్లి అయిపోయిందా కదా బన్నీకి ఇంకా పార్టీ లు ఉండవు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: