ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ పాటంతా బాలీవుడ్ మ్యూజిక్ తో సాగిపోవటం విశేషం. మొన్న ప్రకటించినట్టుగానే ఇవాళ  సైకో సయ్యా పాటను లిరికల్ రూపంలో కాకుండా ఏకంగా వీడియో సాంగ్ ని రిలీజ్ చేసి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది సాహో టీమ్. ఆగడిక సైకో సయ్యా అనే శీర్షికతో సాగే ఈ పాటను తనిష్క్ బాగ్చి కంపోజ్ చేయగా కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ తో పాటు ధ్వనిభానుశాలి స్వరం అందించారు.


పబ్ సాంగ్ నేపధ్యంగా సాగే ఈ పాటలో శ్రద్ధా కపూర్ గ్రీన్ కాస్ట్యూమ్ లో హాట్ హాట్ గా ఉండగా ప్రభాస్ రఫ్ లుక్స్ తో బ్లాక్ జెర్కిన్ తో కిరాక్ అనిపించేలా ఉన్నాడు. స్మూత్ గా అనిపించే స్టెప్స్ తో మూడ్ కు తగ్గట్టు కుదిరిన డాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. ట్యూన్ మాత్రం పక్కా బాలీవుడ్ స్టైల్ లోనే సాగింది. పల్లవిలోని పదాలు అర్థం చేసుకోవడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది. చరణాలు మాత్రం సులువుగానే ఉండేలా లిరిసిస్ట్ శ్రీజో జాగ్రత్త పడ్డారు.


చెప్పాలంటే హిందీలో కంపోజ్ చేసి తెలుగులో డబ్ చేసిన ఫీలింగ్ కలిగిస్తోంది పాట. సాంగ్ విజువల్స్ తో పాటు ట్రైలర్ షాట్స్ కొన్ని ఇందులో పొందుపరిచారు. ఫైనల్ గా చెప్పాలంటే అద్భుతం ఎక్స్ ట్రాడినరి అనే రేంజ్ లో ఈ సైకో సయ్యా పాట లేదు కానీ ఓవరాల్ గా ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే పాస్ అయ్యేలా ఉంది. ఆగస్ట్ 15 విడుదలకు రెడీ అవుతున్న సాహో ఇకనుంచి క్రమం తప్పకుండా అప్ డేట్స్ ప్రవాహం కొనసాగిస్తుందట

మరింత సమాచారం తెలుసుకోండి: