రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం 20 కోట్లు , ఎన్టీయార్ ఇంట్రడక్షన్ సీన్ కోసం 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తుంది. మొదట సినిమాకు అనుకున్న బడ్జెట్ 300 కోట్లు కాగా బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 
 
ఈ సినిమాలో ఎన్టీయార్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీయార్ జోడీగా నటించాల్సిన హాలీవుడ్ హీరోయిన్ చాలా రోజుల క్రిందటే తప్పుకోవడంతో మరో హీరోయిన్ కోసం రాజమౌళి ఇంకా వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. గతంలో గ్రాఫిక్స్ సినిమాజోలికి పోనన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని భారీ గ్రాఫిక్స్ ఉపయోగించి తీస్తూ ఉండటం విశేషం. 
 
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ నిజ జీవితంలో వేరు వేరు చోట్ల పుట్టినప్పటికీ, ఇద్దరూ ఒకే ప్రాంతంలో పుట్టి ఇద్దరూ కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచనతో రాజమౌళి ఈ సినిమాను తీయబోతున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఎన్టీయార్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు రామ రావణ రాజ్యం అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సినిమా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: