ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి దానయ్య నిర్మాణ సారథ్యంలో దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ హిట్స్ తరువాత రాజమౌళి తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో అయన తీసుకున్న స్టార్ క్యాస్టింగ్ కూడా అద్భుతంగానే ఉందట. నిజానికి ఎన్టీఆర్ ప్రక్కన హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్ ని తీసుకోవాలని భావించినప్పటికీ అనుకోని కారణాల వలన ఆమె ఆ సినిమా నుండి తప్పుకుంది. 

ఇక ఇతర భాషలకు చెందిన పలువురు నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరిగా రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి రోల్స్ విషయంలో ఎవరికి ఎన్ని సీన్స్ ఉన్నాయి, సినిమాలో ఎవరి పాత్ర పెద్దది వంటి తదితర విషయాలపై ఆర్ఆర్ఆర్ యూనిట్ నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేనప్పటికీ, రెండు మూడు రోజులుగా మాత్రం ఈ విషయమై సోషల్ మీడియాలో ఒక వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే, కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని హీరోల్లో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనే దానికంటే, 

సినిమాలో సన్నివేశాలను బట్టి ఆయా హీరోలు సీన్ లోకి రావడం జరుగుతుందని, ఒకరకంగా చెప్పాలంటే సినిమా మొత్తంలో ఈ ఇద్దరికీ దాదాపుగా సమానమైన సన్నివేశాలే ఉన్నట్లు చెప్తున్నారు. ఇక ఫైట్స్ లో కూడా ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుందని, అయితే ఎవరికి వారి వ్యక్తిగత జీవితాల్లో జరిగే సంఘటనల సీన్స్ లో మాత్రం కొంత వ్యత్యాసం ఉంటుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలను బట్టి చూసుకుంటే సినిమాలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్  అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: