తెలుగు సినిమాల్లో స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లకు కొదవలేదు. హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించి ఒంటి చేత్తో కలెక్షన్లు తెప్పించినవారే లేడీ సూపర్ స్టార్లుగా చెలామణీ అవుతారు. విజయశాంతి తరువాత లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు ఆ స్థాయి క్రేజ్ తీసుకొచ్చింది అనుష్క మాత్రమే. చారిత్రక గాథల్లోని పాత్రలకు అనుష్క కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన అనుష్క హైరేంజ్ పాత్రలకు మేజర్ ఆప్షన్ అయింది.

 

అనుష్క క్రేజ్ ను స్కైలెవల్ తీసుకెళ్లిన సినిమా 2009లో వచ్చిన అరుంధతి. ఆ సినిమాలో అనుష్క నట విశ్వరూపాన్నే ఆవిష్కరించాడు దర్శకుడు కోడి రామకృష్ణ. హీరోయిన్ ఓరియంటడ్ సినిమాకు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రావడంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన రుద్రమదేవిలో రాణి పాత్రలో ఒదిగిపోయింది. రాణీ రుద్రమను చూస్తున్న భావనే ప్రేక్షకులకు కలిగిందంటే అతిశయోక్తి కాదు. బాహుబలి సిరీస్ సినిమాల్లో రెండు షేడ్లు ఉన్న రాణీ దేవసేన పాత్రలో రాజమౌళికి అనుష్క తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజీయస్ మూవీ “సైరా” లో ఝాన్సీరాణి పాత్ర చేస్తోంది అనుష్క. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాత్రకు అనుష్క తప్ప వేరొకరిని ఊహించలేకపోయిన దర్శకుడు సురేందర్ రెడ్డి వెంటనే ఆమెను ఎంటర్ చేశాడు.

 

చారిత్రక నేపథ్యం ఉన్న కేరక్టర్లకు, రాణి కేరక్టర్లకు అనుష్క కరెక్ట్ గా సూటవుతుందని అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లోని పాత్రలు రుజువు చేశాయి. ఇప్పుడు సైరాలో చేస్తున్న ఝాన్సీరాణి పాత్ర కూడా అనుష్క కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమవుతుందని, ప్రేక్షకులు కూడా ఈ పాత్రకు కనెక్ట్ అవుతారని యూనిట్ చెప్తోంది. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న అనుష్క ఝాన్సీరాణి పాత్రతో మరో లెజండరీ క్యారెక్టర్ లో ఒదిగిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: