ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో మూవీ ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు ఉన్నాయి.  బాహుబలి సినిమాతో పోల్చవద్దని అంటున్నా అభిమానులు మాత్రం బాహుబలిని మించే విధంగా ఉంటుందని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.  ఇది ఒకరకంగా ప్రభాస్ కు మంచిదే అదే విధంగా కొంచం ఇబ్బంది కలిగించే అంశం కూడా.  


మంచిది ఎందుకంటే హైప్ క్రియేట్ అవుతుంది.  ఈ హైప్ తో సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్లు వస్తాయి.  సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే.. కలెక్షన్ల వరద వస్తుంది.  అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా దారుణంగా ఫెయిల్ కావాల్సి వస్తుంది.  భారీ బడ్జెట్ కావడంతో జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు.  పైగా బాలీవుడ్ లో ఈ మూవీ టి సీరీస్ తీసుకుంది కాబట్టి తప్పకుండా నమ్మకం ఉండే ఉంటుంది.  


బాహుబలి తరువాత తన ప్రతి సినిమాను అదే హైప్ తో చేయాలని అనుకుంటున్నాడు.  ఇలా చేయడం మాములుగా ప్రాంతీయ సినిమా హీరోలకు సాధ్యం కాదు.  కానీ, బాహుబలితో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకోవడంతో ఆయనతో తీస్తే అలాంటి భారీ సినిమాలే చేయాలని అనుకుంటున్నారు.  


సాహో తో పాటు ప్రభాస్ జిల్ రాధాకృష్ణతో జాన్ సినిమా చేస్తున్నాడు.  ఇది కూడా భారీ బడ్జెట్ సినిమానే.  షూటింగ్ జరుపుకుంటున్న దీనిపై వార్తలు బయటకు రావడం లేదు.  కారణం ఏంటో తెలిసిందే కదా.  సాహో మానియా నడుస్తోంది.  ఆగష్టు తరువాత జాన్ సోషల్ మీడియా జాన్ సినిమాపై ఫోకస్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: