కొంతమంది దగ్గర అన్ని ఉంటాయి.  అన్ని ఉన్నప్పటికి ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది.  ఆ వెలితి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది.  టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది.  జరుగుతూనే ఉన్నది.  గౌరవం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  


సినిమా బాలేదని పెదవి విరిచారు.  కొత్త జంట కొద్దిగా పర్వాలేదు.  అదీ రెజీనా ఉండటంతో సినిమాకు కలిసి వచ్చింది.  దీని తరువాత కల్యాణ వైభోగమే చేశారు.  బాగానే ఆడింది. పరశురామ్ దర్శకుడు. రీసెంట్ గా ఎబిసిడి సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుంటే.. అదికాస్తా ఫెయిల్ అయ్యింది.  ఫెయిల్ కావడం మాములే అయినపుడు పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏముంది.  


కాకపోతే అల్లు అర్జున్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకుంటే.. అల్లు శిరీష్ హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.  ఎబిసిడి సినిమా సమయంలో అల్లు శిరీష్ కు ఓ ఆఫర్ వచ్చింది.  అదే బందోబస్త్.  సూర్యతో పాటు ఇందులో ఆర్య కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు.  ఆర్యకంటే ముందు ఈ రోల్ అల్లు శిరీష్ వద్దకు వెళ్ళింది.  


అల్లు శిరీష్ దీనిని రిజక్ట్ చేశాడు.  కారణం ఎబిసిడి సినిమా చేస్తుండటంతో పాటు సినిమాలో లుక్ రగ్డ్ గా ఉండటంతో పక్కన పెట్టేశారట.  ఆ తరువాత అది ఆర్య దగ్గరకు వెళ్ళింది.  అసలు కారణం ఇది కాదని, అల్లు శిరీష్ కు లుక్ సెట్ కాలేదని, అందుకే పక్కన పెట్టారని కోలీవుడ్ నుంచి వార్తలు వినిపించాయి.  ఏది ఏమైనా బందోబస్త్ వంటి సినిమాను వదులుకోవడం శిరీష్ తప్పిదమని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: