తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 పై రోజు రోజుకీ ఎంతో ఉత్కంఠ పెరుగుతుంది.  ఇప్పటికే బిబ్ బాస్ సీజన్ 1, 2 ముగిశాయి.  మొదటి సీజన్ కి ఎంత క్రేజ్ వచ్చింది..బిగ్ బాస్ సీజన్ 2 అంత వివాదాస్పదం అయ్యింది.  ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 బుల్లితెరపై సందడి చేయడానికి ముస్తాబవుతుంది.  అయితే మొన్నటి వరకు ఎవరు హూస్ట్ గా వ్యవహరిస్తారన్న విషయంపై రక రకాల చర్చలు నడిచాయి. ఈ మద్య రిలీజ్ అయిన బిగ్ బాస్ 3 ప్రోమోలో నాగార్జున కన్ఫామ్ అయ్యారు.

ఇక బిగ్ బాస్ 3 లో 100 రోజులు 14 మంది ఇంటి సభ్యులు ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు.  మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎవరు రాబోతున్నారో అది సస్పెన్స్.  ఈ షో  ఎప్పుడు మొదలవుతుందా అని కోట్ల మంది  అభిమానులు ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ 3 లో యాంకర్ శ్రీముఖి సహా క్రేజీ సెలబ్రెటీలు చాలా మంది కంటెస్టెంట్లు టాక్ నడుస్తూండటంతో ఈసారి షో ఎలా సాగుతుందన్నదానిపై ఎక్సపెక్టేషన్స్  బాగా పెరిగాయి. 

V6 సావిత్రి కూడా ఇందులో ఉండబోతుందట. తాజాగా ఈ షోలో తెలుగులో హాట్ గా పేరు తెచ్చుకున్న  ఓ హీరోయిన్ పేరు సైతం వినపడుతోంది.  కుమారి 21 ఎఫ్ మూవీతో పాపులర్ అయిన హెబ్బా పటేల్ బిగ్ బాస్ లో ప్రవేశించబోతోందంని, సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాబోతోందని వినికిడి. తాను వరస సినిమాలో బిజిగా ఉన్నా కొట్టిపారేసినా, హఠాత్తుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆమె వస్తోందని ఛానెల్ వాళ్లు ఆ విషయం సీక్రెట్ గా ఉంచమన్నారని తెలుస్తోంది. 

కాకపోతే ఈ విషయంపై మాత్రం బిగ్ బాస్ యాజమాన్యం నుంచి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు. జులై 21న తొలి షో  ఉండబోతోంది. ఈ వీకెండ్ నాటికి కంటెస్టెంట్లు ఎవరన్నది తేలుతుంది. అప్పుడే షో డేట్ కూడా అఫీషియల్‌గా ప్రకటిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: