బొమ్మరిల్లు భాస్కర్-అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ మీదకు వెళ్లాల్సి వుంది . ఈ సినిమాను గీతా ఆర్ట్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయని సమాచారం. కాస్టింగ్ వర్క్ కూడా మొదలైందట. అందులో భాగంగానే కీలకమైన ఓ పాత్రకు దర్శకుడు, నటుడు సముద్రఖనిని తీసుకుంటున్నారని లేటెస్ట్ న్యూస్. తమిళ సినిమాల ద్వారా సముద్రఖని నటుడిగా మన ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యారు.

డైరక్ట్ గా తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అఖిల్ కు తండ్రిగా సముద్రఖని రెండో సినిమా అంగీకరించారు. ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్, రావురమేష్, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్ లాంటి వారే ఇలాంటి పాత్రలకు వున్నారు. ఇప్పుడు సముద్రఖని కూడా తెలుగులో బిజీ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.

బొమ్మరిల్లు భాస్కర్ కీలకమైన ఎమోషనల్ పాత్రలను తయారుచేస్తారు తన సినిమాల్లో. గతంలో ప్రకాష్ రాజ్ మూడు సినిమాల్లో బొమ్మరిల్లు భాస్కర్ తో పనిచేసారు. ఆ పాత్రలు బాగా సక్సస్ అయ్యాయి. అంతేకాదు ఆ పాత్రల్లో ప్రకాశ్ రాజ్ కూడా సరిగ్గా సరిపోయారు. మరి ఇప్పుడు సముద్రఖని కోసం ఎలాంటి పాత్ర తయారు చేసారో చూడాలి. అయితే ఈ సినిమాలో  తండ్రి పాత్ర ఓకే గాని ఇంతవరకు హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది..అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: