మన టాలీవుడ్ స్టార్స్ అందరు ఎక్కువ శాతం ఈ సీజన్ లో అవుట్ డోర్ లో కాకుండా సిటీతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉండటం విశేషం. ఇదంతా కాకతాళీయమే కావొచ్చు కానీ ఒకేసారి అందరూ అందుబాటులో ఉండటం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వికారాబాద్ లో వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మొదటిసారి నాగ చైతన్య మావయ్య తో ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ ఇంకో నెల ఆలస్యం కానుందని లేటెస్ట్ న్యూస్. 

ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి అనంతపూర్ నుంచి రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. అంతేకాదు మన మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న డిస్కో రాజా షూటింగ్ తో అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్నాడు. గత రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీదే చాలా నమ్మకం పెట్టుకున్నాడు రవితేజ.   

ఇక మణికొండ డాలర్ అవర్స్ లో నాగశౌర్య అశ్వద్ధామ షూటింగ్ జరుగుతోంది. ఇది కూడా వేగంగా సాగుతున్న షెడ్యూలే. ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి అమెరికా వెళ్లిన కారణంగా బ్రేక్ ఇచ్చారు. వచ్చాక ఇక్కడ కంటిన్యూ అవుతుందా లేక నేరుగా అహ్మదాబాద్ వెళ్తారా ఇంకా తెలియలేదు. చరణ్, తారక్ ఇద్దరూ సిటీలోనే ఉన్నారు. వీళ్ళతో పాటు అల్లు అర్జున్ త్రివిక్రమ్ షూటింగ్ లో, సాయి తేజ్ ప్రతిరోజు పండగే షూట్ కోసం లోకల్ లోనే ఉన్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు కోసం కాశ్మీర్ వెళ్ళాడు. ఒకరు ఇద్దరు మినహాయిస్తే కీలకమైన స్టార్లందరూ భాగ్యనగరంలోనే ఉన్నారు. ఇలా ఇంతక ముందెప్పుడు జరగకపోవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: