అరవింద సమేత సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్ చేస్తూ ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సైన్ చేశాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. తారక్, చరణ్ మల్టీస్టారర్ సినిమాగా వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి.


అల్లూరిగా చరణ్, కొమరం భీం గా తారక్ ఇద్దరు తమ పాత్రల్లో అదరగొట్టబోతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ కొరటాల శివ సినిమా చేస్తాడని తెలుస్తుండగా ఎన్.టి.ఆర్ మరోసారి త్రివిక్రం డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. త్రివిక్రం డైరక్షన్ లోనే లాస్ట్ ఇయర్ అరవింద సమేత సినిమా చేశాడు తారక్.


ఆ సినిమా టైంలో త్రివిక్రం తో తారక్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. ప్రస్తుతం త్రివిక్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఎన్.టి.ఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారట. తారక్ తో త్రివిక్రం ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.


ఆర్.ఆర్.ఆర్ సినిమా మరోసారి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలిసేలా చేస్తుందని చెప్పొచ్చు. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు రాజమౌళి. అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: