బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఆడియెన్స్ ఎవరు ఊహించని మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీగా ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఈ సినిమాలో కొమరం భీం గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ కనిపిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.


ఒక్క స్టార్ తోనే అద్భుతాలను సృష్టించగలిగే జక్కన్న ఇద్దరు సూపర్ స్టార్స్ తో ఆర్.ఆర్.ఆర్ మొదలు పెట్టాడు. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేసేలా సినిమా షూటింగ్ జరుగుతుందట. ముఖ్యంగా సినిమాలో హైలెట్ గా నిలిచే ఓ ఫైట్ సీన్ 30 కోట్లతో తెరకెక్కుతుందట. ఆ సీన్ సినిమాకే హైలెట్ అని తెలుస్తుంది.


ఆ సీన్ లోనే తారక్, చరణ్ ఎదురుపడతారని ఇక మెగా, నందమూరి ఫ్యాన్స్ అయితే ఆ సన్నివేశం వచ్చినప్పుడు సీట్లలో కూర్చోవడం కష్టమే అని అంటున్నారు. ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి ఏ హీరోతో ఎలాంటి సినిమా చేస్తే ఫ్యాన్స్ మెచ్చుతారో తెలుసు. అందుకే ఆర్.ఆర్.ఆర్ అంటూ చరణ్, తారక్ లతో మరో సంచలనం సృష్టిస్తున్నాడు.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతుంది. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు పోటాపోటీగా నటించి మరో బాహుబలి కాదు కాదు అంతకుమించి తెలుగు సినిమా స్థాయిని తెలిసేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: