2020 జులై 30 వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్లో బాహుబలి2 స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ జరుపుకుంటుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్గా అలియా భట్ నటిస్తుంది. మరో హీరో ఎన్టీయార్ కు హీరోయిన్గా గతంలో ఒక హాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. 
 
ఆ హీరోయిన్ తప్పుకోవడంతో రాజమౌళి ఎన్టీయార్ కోసం ఎందరో హీరోయిన్లను పరిశీలించాడు. చివరిగా ఎన్టీయార్ కు జోడిగా శ్రధ్ధా కపూర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రధ్ధా కపూర్ ఇప్పటికే ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాహో సినిమా విడుదలైన తరువాత శ్రధ్ధా కపూర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. 
 
రాజమౌళి సినిమా ఆఫర్ రాగానే శ్రధ్ధా కపూర్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వారం రోజుల పాటు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగులో ఇప్పటిదాకా ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చినప్పటికీ ఆర్ ఆర్ ఆర్ వాటన్నిటిలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అని చెప్పవచ్చు


మరింత సమాచారం తెలుసుకోండి: