తెలుగు టెలివిజన్ తెరపై ఇప్పటివరకు ఎందరో యాంకర్లు వచ్చారు, వెళ్లారు. అయితే అలా యాంకర్ గా వచ్చిన వారిలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన యాంకరింగ్ స్టయిల్ తో చెరగని ముద్ర వేసింది మాత్రం ఎక్కువ శాతం సుమ గారే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. కేవలం టివి షోలు మాత్రమే కాక కొన్ని ముఖ్యమైన సినిమా ఆడియో, ప్రి రిలీజ్ ఫంక్షన్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించే సుమగారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభిమానులున్నారు. ఇక ఇప్పటికీ పలు టెలివిజన్ ఛానల్స్ లో ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాలకు సుమ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

అయితే ఆమెకు సంబందించిన ఒక వార్త నేడు కొన్ని మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 కోసం సుమ గారిని ఎంపిక చేసి, ఈ విషయమై ఆమెతో మాట్లాడానికి ఇటీవల బిగ్ బాస్ టీమ్ ఆమెను సంప్రదించారని, అంతేకాక ఇందుకు గానూ సుమకు భారీ మొత్తం చెల్లిస్తామని ఆఫర్ కూడా చేశారని సమాచారం. అయితే ఆమె ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. వాస్తవానికి తనకు బిగ్ బాస్ షో అంటే ఎంతో ఇష్టమని అయితే, తాను బిగ్ బాస్ లో దాదాపుగా వంద రోజులపాటు పాల్గొంటే, త్వరలో తాను చేయవలసిన షోలన్ని వదులుకోవాల్సి వస్తుందని, దానివలన కొన్ని సమస్యలు ఎదురవుతాయని భావించి బిగ్ బాస్ కు రాలేనని ఆమె తేల్చి చెప్పారట. 

అయితే సుమగారు ఈ ఆఫర్ వదులుకోవడంతో ఆమె ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే, సుమగారు ఒకవేళ బిగ్ బాస్ కు వస్తే, ఆమె తన ఆకట్టుకునే వ్యవహార శైలితో ఆడియన్స్ నుండి మంచి మార్కులు సంపాదించి విజేతగా నిలిచేవారని, ఇంతటి అద్భుత అవకాశాన్ని ఆమె వదులుకున్నందుకు వారు ఎంతో ఫీల్ అవుతున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం విపరీతంగా పుకారవుతున్న ఈ వార్తల్లో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే సుమ గారినుండి అధికారిక ప్రకటన వెలువడవలసిందే......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: