రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ వచ్చినా విపరీతంగా హైప్ క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

దీనికి తగ్గట్టే ఇప్పుడొక చిన్న అప్డేట్ వచ్చింది. కొమరం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సెపరేట్ డైట్, జిమ్ చేస్తున్నాడు. అరవింద సమేత సమయంలో ఎన్టీఆర్ కు పనిచేసిన ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ నే మరోసారి ఈ సినిమా కోసం జక్కన్న ఏర్పాటు చేశాడు. అతని ట్రయినింగ్ లో ఎన్టీఆర్ చెమటోడుస్తున్నాడు. ఇందుకు సంబంధించి లాయిడ్ స్టీవెన్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఎన్టీఆర్ జిమ్ లో ఎక్స్ ర్సైజ్ చేస్తున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్ కాళ్లు, తొడలు ఫిట్ గా ఉన్న పిక్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫేస్ కనబడకుండా కాళ్లు మాత్రమే కనబడేలా ఆ ఫోటోను తీశారు. “ఎన్టీఆర్ ఫిట్ నెస్ గురించి ప్రతి అప్డేట్ ఇస్తాం” అని స్టీవెన్స్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన పాత్ర కోసం ఎన్టీఆర్ పడుతున్న కష్టం కనపడుతోంది.

 

అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఇప్పటికే ఫిట్ గా ఉన్నాడు. వినయవిధేయ రామ కోసం చరణ్ ఫుల్ బాడీ ఫిట్ నెస్ తో ఉన్నాడు. మరి ఈ మాత్రం చిన్న పోస్ట్ కే ఇంత బజ్ వస్తే మిగిలిన అప్డేట్లు వస్తే ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేసేందుకు షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: