తేజాకు కోపం ఎక్కువా. చెప్పినట్టు వినకపోతే సెట్స్ లో ఎవరినైనా సరే కొడతాడు. అసలు ఉపేక్షించడు. ఆయనకు చెప్పినట్టు చేయాల్సిందే. షాట్ సరిగా రాకుంటే మళ్ళీ మళ్ళీ చేయిస్తాడు అనే టాక్ ఉంది. అందుకే ఆయనతో సినిమాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేస్తుంటారు.
ఇలా సెట్స్ లో కొడతాడు అనే దానికి వెనుక చాలాపెద్ద కథ ఉందట. తేజా సినిమాలు బాగుంటాయి. ఆయనతో కలిసి సినిమాలు చేయాలని అని చెప్పి చిన్న పిల్లల దగ్గరి నించి పెద్ద వాళ్ళ వరకు తేజా ఆఫీస్ ముందు క్యూకడతారట. ఎంత చెప్పినా వినకుండా గంటల తరబడి అలాగే నిలబడి ఉంటారు.
దీంతో ఒకవేళ అవకాశం ఇచ్చి నటన సరిగా రాకుంటే తేజా ఏం చేస్తారు అనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు తేజా ఇలా చేస్తుంటారట. ఓసారి నిజంగానే సెట్స్ లో హీరోయిన్ ను కొట్టాల్సి వచ్చింది. ఊరికే కొట్టలేదు. ఆ సీన్ బాగా రావాలి. వస్తే సినిమా బాగుంటుంది.
నువ్వు నేను సినిమా సమయంలో అది జరిగింది. సీన్ లో హీరోయిన్ ఏడవాలి. కానీ, ఎంత ప్రయత్నించినా హీరోయిన్ ఏడవడం లేదు. తేజాకు కోపం వచ్చింది.. చెంపమీద ఒక్కటిచ్చాడు. అంతే హీరోయిన్ వలవల ఏడ్చేసింది. సీన్ పర్ఫెక్ట్ గా వచ్చింది. అప్పటి నుంచి తేజా సెట్స్ లో సరిగా చేయకుంటే కొడతాడు అనే పేరు వచ్చిందనే నానుడి అలా ఉండిపోయింది.