‘సాహో’ మొదటిపాటకు సుమారు 15 మిలియన్స్ వ్యూస్ బాలీవుడ్ ప్రేక్షకుల నుండి వచ్చినా ఈమూవీని కార్నర్ చేస్తూ విడుదల అవ్వాలి అని భావించుకున్న బాలీవుడ్ టాప్ హీరోల ఆలోచనలలో ఎటువంటి మార్పులు తీసుకు రాలేకపోయింది. ‘సాహో’ బడ్జెట్ గురించి వార్తలు ఆతరువాత ఈమూవీ టీజర్ పై ఫస్ట్ సాంగ్ విడుదల తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోకొంత జంకు ఏర్పడుతుంది అని భావించారు అంతా.

అయితే అంచనాలకు భిన్నంగా అక్షయ్ కుమార్ మూవీ ‘మిషన్ మంగల్’ను ఆగస్టు 15కి ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమాను ఓ రేంజిలో పొగిడేస్తూ రిలీజ్ డేట్‌ను స్వయంగా ప్రకటించాడు అక్షయ్ కుమార్. ఇది చాలదన్నట్లు తాజాగా జాన్ అబ్రహాం సినిమా ‘బాట్లా హౌస్’ను కూడా ఆగస్టు 15కి ఖరారు చేశారు. రిలీజ్ డేట్‌తో పోస్టర్ కూడా విడుదల చేసారు. 

వాస్తవానికి బాలీవుడ్ లో జాన్ అబ్రహంకు చెప్పుకో తగ్గ మార్కెట్ లేదు. అయినా అతడు కూడ ‘సాహో’ ను లెక్క చేయడం లేదు. మరోవైపు తమిళంలో కూడా ఇండిపెండెన్స్ డేకి ఒక సినిమా విడుదల చేయడం ఖాయం చేసుకుంది. జయం రవి కాజల్ జంటగా నటిస్తున్న ‘కోమలి’ ‘సాహో’ ను కార్నర్ చేయబోతోంది. 

మరోవైపు మలయాళంలో కూడ రెండు మూడు సినిమాలు ‘సాహో’ ను టార్గెట్ చేస్తూ ఆగష్టు 15న విడుదల కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో చిన్న సినిమాలు కూడ ‘సాహో’ ను లెక్క చేయడం లేదా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాలోని పాటలు అంతంతమాత్రంగా ఉంటాయి అన్న లీకులు వస్తున్న నేపధ్యంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చక్రవ్యూహంలో ‘సాహో’ చిక్కుకోవడం ఓఅక విధంగా ఆశ్చర్యపరిచే విషయే కాకుండా ప్రభాస్ ను బాలీవుడ్ లైట్ తీసుకుంటోందా అన్న సందేహాలు రావడం సహజం..  



మరింత సమాచారం తెలుసుకోండి: