ప్రభాస్ తెలుగు హీరో.  తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు.  అయితే, బాహుబలి సినిమా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన నేపథ్యంలో తెలుగుతో పాటు హిందీలోను ప్రభాస్ కు క్రేజ్ పెరిగింది.  సాహో సినిమాకు ఇప్పుడు అలాంటి క్రేజ్ వచ్చింది. 

సాహో కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది.  ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్న తరుణంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యిన ఫస్ట్ సింగిల్ పై అనేక నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.  


ఈ సాంగ్ లో తెలుగు  పదాల కంటే హిందీ పదాలే ఎక్కువగా వాడారని, సాంగ్ హిందీలోనే బాగుందని వార్తలు వస్తున్నాయి.  పైగా టీజర్ లో కూడా హిందీ నటీనటులను ఎక్కువ చూపించారు.  బాలీవుడ్ పైనే ఎక్కువ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.  


యాక్షన్, బాలీవుడ్ పై ఎక్కువ దృష్టిపెడితే తరువాత పీక్కోలేక లాక్కోలేక సాహో యూనిట్ ఇబ్బంది పడాల్సి వస్తుంది.  ఎందుకంటే తెలుగులో సినిమా ఆడాలి.  ప్రభాస్ కు తెలుగులోనే ఫ్యాన్స్ ఎక్కువ.  తెలుగులో హిట్టయితే ... ఆటోమాటిక్ గ బాలీవుడ్ లో హిట్టవుతుంది.  మరి చూద్దాం ప్రభాస్ ఏం చేస్తాడో. 


మరింత సమాచారం తెలుసుకోండి: