ఈ మద్య కొత్త హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు దర్శక, నిర్మాతలు కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.  కంటేంట్ బాగుంటె ఎలాంటి చిత్రాలైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న విషయం తెలిసిందే.  ఇటీవల కొత్త దర్శకులు సందీప్ వంగా తీసిన ఆర్జున్ రెడ్డి, అజయ్ భూపతి తీసిన ఆర్ఎక్స్ 100 మంచి విజయాలు అందుకున్నాయి.  తాజాగా తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా " ఏయ్ జూనియర్ " చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ చిత్రాన్ని వ్యాంకిష్ మీడియా సంస్థ నిర్మించగా , షేక్ గౌస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రవికుమార్ పొన్నగంటి. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథా చిత్రం అని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చిత్ర యూనిట్ అంటున్నారు. 


నిర్మాత షేక్ గౌస్ ఇంకా మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న మా ఈ చిత్రం టీజర్ ని వచ్చే వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఆడియో ని ఆగస్ట్ మొదటి వారంలో చిత్రాన్ని ఆగస్ట్ చివరి వారంలో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. 


దర్శకులు రవికుమార్ పొన్నగంటి మాట్లాడుతూ...' కాలేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఓ చక్కని టీనేజ్ లవ్ స్టోరీ గా దీన్ని తెరకెక్కించామని, అసభ్యతకు తావులేకుండా కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రాన్ని నిర్మించామని , ఇందులో పాటలన్నీ యువతకు నచ్చే విధంగా ఉంటాయని ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకి టెక్నీషియన్స్  కి అలాగే నాకు దర్శకునిగా అవకాశమిచ్చిన షేక్ గౌస్ గారికి ధన్యవాదాలు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: