శ్రీదేవి....ఈ అతిలోక సుందరి చనిపోయి ఏడాది అయ్యింది అంటే ఇంకా నమ్మబుద్ధి కాదు....అలాంటిది ఆమె పాపులారిటీ. తన హఠాత్ మరణం పై పలు సందేహాలు వచ్చిన, కపూర్ ఫామిలీ దీన్ని పెద్దది చేయొద్దు అని ప్రాధేయపడడం తో వెనక్కి తగ్గారు అందరు. కానీ ఇప్పుడు,  ఆమె మరణంపై మొదట్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..  దుబాయ్ పోలీసులు శ్రీదేవి ప్రమాదవశాత్తూ మరణించిందని.. కుట్రకోణం లేదని తేల్చారు. కానీ  తాజాగా అండైన వార్తల ప్రకారం, కేరళకు చెందిన జైళ్ల శాఖ డిజిపి రిషిరాజ్ శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేసారు.....దింతో మల్లి శ్రీదేవి వార్తల్లోకి ఎక్కింది.


కేరళలో ప్రింట్ అయ్యే 'కౌముది' అనే పత్రికకు ఆయన రీసెంట్ గా ఇంటర్వ్యూ  ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో శ్రీదేవి మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణం సహజమైనది కాదని.. బాత్ టబ్ లో పడి చనిపోలేదని.. హత్య చేయబడిందని ఆయన అంటున్నారు, కానీ దీనికి సపోర్ట్ గా అడహరాలు మాత్రం తన దెగ్గర లేవని, కానీ దొరికిన ఆధారాలని కనుమరుగు చేసారని ఆరోపించారు .  రిషి రాజ్ తో తన స్నేహితుడు ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని చెప్పడం జరిగిందట.  దీంతో ఆ  సంఘటన గురించి ఇంకా వివరాలు అడిగాడట.  "శ్రీదేవి అతిగా మద్యం సేవించినా కేవలం ఒక అడుగు నీళ్ళల్లో పడి చనిపోయే అవకాశం లేదు. ఎవరైనా వెనుక నుంచి తోస్తేనే అలా జరుగుతుంది.  ఒకవేళ అలా కాకుండా ఒక అడుగు లోతు నీరు ఉన్న బాత్ డబ్ లో పడినా అది మరణానికి దారి తీయదు" అని ఆయన చెప్పారట.
 
ఏదో ఒక సాధారణ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ పలు కేసులను దగ్గరగా చూసిన పోలీసు అధికారి.. పైగా అయన స్నేహితుడు కూడా ఎన్నో ఫోరెన్సిక్ కేసులను డీల్ చేసిన వ్యక్తి కావడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ రిషిరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలను మనం జస్ట్ అనుమానాలు లేదా ఆరోపణలు గా తీసుకోవాల్సి ఉంటుంది.  ఈయన వ్యాఖ్యలను బట్టి దుబాయ్ పోలీసుల విచారణ సరిగా సాగలేదని ఆరోపించినట్టేననుకోవాలి. 


ఇదిలా ఉండగా, అధరాలు లేకుండా మాట్లాడుతున్న డీజీపీ కి సోషల్ మీడియా లో కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి, సెలబ్రిటీ ని అడ్డుపెట్టుకొని ఫేమస్ అవుదామని డీజీపీ చూస్తున్నారు అని కొందరు అంటుండగా, తమకి శ్రీదేవి మరణం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయ్ అని, సరిగా మరోసారి దుబాయ్ పోలీసులు దర్యాప్తు చెయ్యాలని కొందరు మద్దతు పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: