మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతున్నది.  ఇందులో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.  ఇందులో మహేష్ పేరు అజయ్ కృష్ణ.  మేజర్ అజయ్ కృష్ణ.  ఈ పేరు పెట్టడం వెనుక ఓ రహస్యం ఉందని తెలుస్తోంది.  


మహేష్ బాబు పోకిరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు.  ఇందులో ఆయన పేరు కృష్ణ మనోహర్.  ఈ పేరు చివరి వరకు రెవీల్ కాదు.  ఈ మూవీ సూపర్ హిట్టైంది.  దీని తరువాత అండర్ కవర్ ఆఫీసర్ గా దూకుడు చేశారు.  ఈ మూవీ కూడా సూపర్ హిట్ కొట్టింది.  ఇందులో మహేష్ పేరు అజయ్.  


ఈ రెండు సినిమాలు పోలీస్ పాత్రలకు సంబంధించిన సినిమాలే.  అందుకే ఈ రెండు పేర్లలో రెండు పదాలను తీసుకొని అజయ్ కృష్ణగా సరిలేరు నీకెవ్వరూలో పెట్టారని తెలుస్తోంది.  మేజర్ గెటప్ లో ఉండే పాత్ర నిడివి తక్కువే.  అయినా ఈ రోల్ సినిమాకు ప్లస్ అవుతుందట.  


కాశ్మీర్ తరువాత హీరో రైల్లో నేటివ్ ప్లేస్ కు బయలుదేరుతారు.  అలా రైల్లో వచ్చే సమయంలో ప్రధాన తారాగణంమధ్య మంచి కామెడీ ఉంటుందని, టైమింగ్ కామెడీతో పాటు, ఈ కామెడీ లెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుందని యూనిట్ నుంచి అందుతున్న సమాచారం.  వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రాబోతున్నది.  అల్లు అర్జున్ 19 వ సినిమాతో ఈ మూవీ పోటీ పడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: