తెలుగు సినిమా స్థాయి రోజురోజుకి పెరిగిపోతుంది. మూస కథలను ప్రేక్షకులు తిప్పికొట్టడమే కాకుండా కొత్త కథలను చక్కగా ఆదరిస్తున్నారు. కొత్త ఐడియాలతో, కొత్త కథలతో యువ దర్శకులు ఇండస్ట్రీని ఊపేస్తూ,పెద్ద దర్శకులకు సవాలు విసురుతున్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమాను తెరకెక్కించి  నిర్మాతలకు ఎక్కువ లాభాలు అందిస్తున్నారు.

 అందుకే యువ దర్శకులతో సినిమాలు తీయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు,పెద్ద పెద్ద హీరోలు సైతం పోటీ పడుతున్నారు."మహానటి" చిత్రాన్ని నిర్మించిన నాగ్ అశ్విన్ మీద భారీ అంచనాలు లేకున్నా కేవలం "మహానటి" లాంటి అద్భుతాన్ని అందించి సినిమా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.2017 వచ్చిన "అర్జున్ రెడ్డి" యువతను ఎంత ఆకర్షించిందో మనందరికీ తెలుసు, ఒక్క సినిమాతో సందీప్ వంగ బాలీవుడ్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడై పోయాడు.అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ "కబీర్ సింగ్" ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో చేస్తున్న రచ్చ అంత ఇంత కాదు.

టాలీవుడ్ కి ఈ ఏడాది కలిసి వచ్చిందనే చెప్పాలి, మజిలీ, జెర్సీ, మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచేవారేవారురా, ఓ బేబీ బాక్స్ ఆఫీస్ లో హిట్ టాక్ తెచుకున్నాయి. కొత్త దర్శకుల కొత్త కథలు తెలుగు సినిమాని కొత్త మజిలీ వైపు నడిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: