వితిక షేరు పేరు తెలిసే ఉంటుంది. కానీ ఎవరా అని మాత్రం కాసేపు ఆలోచించుకోక తప్పదు. అందుకే హీరో వరుణ్ సందేశ్ శ్రీమతి..అంటే మాత్రం ఒహ్ తనా అని గుర్తు చేసుకుంటారు. అంతే కాదు ఆమె టాలీవుడ్ తో పాటు కన్నడ సినిమాలతో  హీరోయిన్ గా నటించిన ఈ భీమవరం బ్యూటీ కొన్ని తెలుగు సినిమాల్లో మొదట చిన్న పాత్రలు చేసింది. తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయింది.  'ఝుమ్మంది నాదం'.. 'భీమిలి కబడ్డీ జట్టు'.. 'పడ్డానండీ ప్రేమలో మరి' ఆమె నటించిన సినిమాలు. అయితే వరుణ్ సందేశ్ తో ప్రేమవివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఈమధ్య బిగ్ బాస్ 3 లో ఒక కాంటెస్టెంట్ గా ఎంపిక అయిందనే వార్తలు వచ్చాయి.  భర్త వరుణ్ సందేశ్ తో పాటు వితిక కూడా బిగ్ బాస్ 3 హౌస్ మేట్స్ గా ఉండబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వితిక ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా లో షేర్ చేసింది.  ఈ ఫోటోలలో కాస్త స్పైసీగా మెరిసిపోతోంది. రెండు జడలు వేసుకొని ఆ జడలను పట్టుకొని మరీ పోజిచ్చింది. ఏదేమైనా మన తెలుగు హీరోయిన్ శ్రీమతి అయిన తర్వాత స్పైసీ ఫోటోషూట్లు చేయడం సంచలనమే.  
 
అందుకే సర్ ప్రైజ్ అయిన నెటిజన్లు "సో హాట్ సో బ్యూటిఫుల్".. "భీమవరం ఫ్యాషన్ ఐకాన్".. BB3 లో నిన్ను చూడాలని ఉంది" అంటూ కామెంట్లు పెట్టారట.  మరి నిజంగానే బిగ్ బాస్ 3 లో కనిపిస్తుందా లేక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇదంతా నెట్ ప్రాక్టీసా అనేది త్వరలోనే క్లారిటీ వస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: