జారుడు అన్నది మొదలైతే లోతు ఎంతో తెలియదు జారుతూనే ఉంటారు. తెలుగు సినిమా విషయానికి వస్తే హిమ శిఖరం మీద నుంచి ప్రవహిస్తూ ఇలకు జారిన నీటి చందాన అలా దిగుతూ దిగుతూ ఎక్కడికో జారిపోయింది. ఓ వైపు సినిమాలు ఎన్ని తీసినా ఫట్ అవుతున్నాయి. ఇక జనాలకు అన్నీ తెలిసిపోతున్నాయి. చూపించేందుకు ఏమీ లేదనుకుంటున్నారు.


దాంతో నగ్నంగా గా నటించడమే ఇపుడు కళాత్మకమైంది. ఆమె అని ఒక డబ్బింగ్ మూవీ వస్తోంది. దీని  తమిళక మాత్రుక వేరే ఉంది. గ్లామర్ నటి అమలాపాల్ ఈ మూవీలో నటించింది. ఆమె డేర్ చేసి నగ్నంగా నటించింది. పాత్ర డిమాండ్ చేసింది నేను  నటించాను అంటోంది  అమలాపాల్.


డైరెక్టర్ ఏదో విధంగా మ్యానేజ్ చేద్దామన్నా కూడా అమలలోని నటి నో అని చెప్పిందట. ఎంతో రిస్క్ చేసి అలా నటించానని చెప్పింది. బాగానే ఉంది కానీ మరీ అంత నగ్నంగా నటిస్తే తప్ప జనాలు చూడరా. అపుడు కానీ ఆ మూవీకి సంచలనం రాదా అన్నదే ఇక్కడ  పాయింటు. 


అసలు విషయ‌మేంటంటే తమదైన అద్భుత నటనతో సినిమా హాలుకు రప్పించుకునే రోజులు పోఅయాయి. నగ్నత్వంతోనే ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇలా జారుతూ జోరు పెంచుకుందామంటే అంతు పొంతూ ఎక్కడ ఉంది. ఎంతదాకా జారిపోతారలా, సినిమా కళను ఎంతలా దిగజారుస్తారలా అన్నది కళా ప్రేమికుల ప్రశ్న. సమాధానం ఉందా.


మరింత సమాచారం తెలుసుకోండి: