బాలీవుడ్ శృంగార తార మల్లికా శెరావత్ సామాజిక సేవలో తరించిపోవాలని నడుం కట్టింది . ఇన్నాళ్లు తన అందాలతో యువతని పిచ్చెక్కించిన మల్లికా శెరావత్ కు చేతిలో సినిమాలు లేకుపోవడంతో బోర్ కొడుతుందేమో దాంతో తనకి పని కావాలి కాబట్టి అందునా సమాజానికి ప్రజానాకారిగా ఉండాలి కాబట్టి సామాజిక సేవ కోసం కంకణం కట్టుకుంది .


రోటరీ ఇంటర్నేషనల్ అనే సామాజిక సేవా సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనుంది మల్లికా శెరావత్ . దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లయినా ఇంకా పోలియో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి దాంతో పోలియో ప్రచారకర్త గా మారింది మల్లికా శెరావత్ . 


తెరపై శృంగార సన్నివేశాల్లో జీవించిన ఈ భామని కొంతమంది హీరోలు , దర్శక నిర్మాతలు టార్గెట్ చేయడంతో పాపం సినిమాలు లేకుండాపోయాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: