రామ్ గోపాల్ వర్మ అనగానే శివ సినిమా గుర్తుకు వస్తుంది.  శివ సినిమాను ఆయన తీసిన తీరు అద్భుతం అని చెప్పాలి.  సినిమా ఇండస్ట్రీని శివ కు ముందు శివ తరువాత అనే విధంగా మార్చిసింది.  అందుకే శివ సినిమా అంతగా పాపులర్ అయ్యింది. ఇందులో ప్రతి షాట్ అద్భుతం అని చెప్పాలి.  


అన్నింటికంటే చిన్నాను చంపే సీన్.  సినిమాకు హైలైట్ గా ఉంటుంది.  స్టడీ కామ్ కెమెరాతో షూట్ చేశారు. రియలిస్టిక్ గా వచ్చింది ఆ సన్నివేశం.  అసలు ఈ సీన్ ఇలా రావడానికి కారణం ఏంటి.. అంటే.. ఆ రోజు రాత్రి షూటింగ్‌ కోసమని లైట్లు తుడిచి, వాటిని బిగించి, వెలుగుతున్నాయో లేదో సరిచూసుకుంటున్నారు చిత్ర బృందం. హెచ్‌ఎంఐ లైట్స్‌కి ఉన్న కండెన్సర్‌ ఓపెన్‌ చేసి బల్బ్‌ వెలిగించగానే, సెట్‌లో పనిచేసే వారు ఆ లైట్‌ ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. 


అప్పుడు అక్కడే ఉన్న ఎస్‌.గోపాల్‌రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి వారి నీడలను గమనించారు. ‘అరె భలే ఉందే. ఈ ఐడియాను తప్పకుండా వాడాలి’ అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని సినిమాలో పెట్టారు. ఇలాగే శుభలేఖ సుధాకర్‌ను హత్య చేసే సన్నివేశం కూడా కాస్త డిఫరెంట్‌గా తీశారు. 


కెమెరా బ్యాగ్‌కు రంధ్రం చేసి, దాని నుంచి లెన్స్‌ బిగించారు. రౌడీలు తరముతున్నట్లు శుభలేఖ సుధాకర్‌ వెనకాల కెమెరాను పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ సీన్లు తీశారు. ఈ రెండు సీన్లు భయంకరంగా ఉంటాయి.  అదే విధంగా కొత్తగా ఉంటాయి.  అందుకే ఈ రెండు సీన్లు సినిమాలో హైలైట్ అయ్యాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: