టాలీవుడ్‌లో స్టిల్ బ్యాచిల‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌సుత్తం మ‌హేష్‌ న‌టిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న‌ చిత్రాల‌కు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.  తాజాగా ఇప్పుడు ఆయ‌న ఇంట్లో పెళ్లి బాజా మోగింది. దేవిశ్రీ సోద‌రుడు సాగ‌ర్ వాళ్ల‌కు ద‌గ్గ‌ర బంధువు అయిన డాక్ట‌ర్ మోనిక‌ను ఈనెల‌ 19న పెళ్లాడారు. ఈ వేడుక‌లో దిగిన ఫోటోలో  దేవిశ్రీ ఎంతో వైబ్రేంట్‌గా ఉన్నారు. 


ఇక తాజాగా ఈ వేడుక‌లో దిగిన గ్రూప్ ఫోటోను దేవిశ్రీ  వివాహం జ‌రిగిన రెండు వారాల‌కు షేర్ చేశారు. ఈ వివాహం జూన్ 19న జ‌రిగింద‌ని, అదే రోజు త‌మ త‌ల్లిదండ్రుల వెడ్డింగ్ యానివ‌ర్శ‌రీ అని దేవిశ్రీ తెలిపారు. అయితే ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఎప్ప‌టి నుంచో అంద‌రిలోనూ ఉన్న ప్ర‌శ్న దేవిశ్రీ పెళ్లి ఎప్పుడు? దేవిశ్రీ వివాహంపై చాలా కాలం నుంచి సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇంత‌కు ముందు దేవిశ్రీ ప్రేమాయ‌ణంపై చాలా క‌థ‌నాలే వ‌చ్చాయి. 


అందాల రాశి ఛార్మీతో ప్రేమ‌లో ఉన్నాడ‌ని త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకుంటార‌ని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు. ఇక తాజాగా రంగ‌స్థ‌లం సినిమాలో న‌టించిన పూజిత పొన్నాడ అంద‌చందాల‌కు ముగ్ధుడై దేవిశ్రీ  ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి అని వ‌చ్చిన క‌థ‌నాలు కూడా  రూమ‌రేన‌ని తేలింది. ఇక త‌న సోద‌రుడి వివాహం త‌ర్వాత ఇంతకీ దేవీశ్రీ ఓ ఇంటివాడయ్యేదెపుడు? అన్నది తేలాల్సి ఉంది. ఇప్ప‌టికైనా త‌న వివాహం గురించి దేవిశ్రీ‌ చెబుతాడేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: