ప్రస్తుతం స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా వస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ల కూతుర్లు హీరోయిన్లుగా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.  విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అతి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి హిట్ సినిమాల్లో నటించిన శృతిహాసన్ కొంత కాలంగా సినిమాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత శృతి హాసన్ మరో సినిమాలో నటించలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని తమిళ మూవీలకు సైన్ చేస్తోంది. తన ప్రియుడు మైఖేల్ తో శృతి హాసన్ చెట్టాపట్టాలేసుకుని పబ్లిక్ గానే తిరిగింది. వీరిద్దరి వివాహం జరగబోతుందని..ఇందుకు కమల్ హీసన్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.  కానీ అనుకోకుండా వీరిద్దరి మద్య బ్రేకప్ వచ్చిన విషయం తెలిసిందే. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడతూ..ఈ మద్య కొంత మంది నెటిజన్లు చేసిన కామెంట్స్ నాకు ఎంతో బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. శృతి హాసన్ కు పెళ్లైపోయింది.. అందుకే లావైంది' అని చాలా మంది కామెంట్స్ చేశారని..వాస్తవానికి నాకు అనారోగ్య కారణంతోనే సినిమాలకు దూరంగా ఉంటున్నానని తెలిపింది. 

ఇన్నాళ్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని..ఇప్పుడు వాటిని అధిగమించానని అన్నారు. ప్రస్తుతం కెరీర్ గురించి ఆలోచనలే నాకు ఎక్కువగా ఉన్నాయని శృతిహాసన్ తెలిపింది.  శృతి హాసన్, మైఖేల్ కొన్ని రోజుల క్రితమే విడిపోయారు. ఈ విషయాన్ని శృతి హాసన్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: