గత కొద్దిరోజులుగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ నేతలపై అలానే టిడిపి అధినేత చంద్రబాబుపై తనదైన శైలిలో తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని సెటైర్లు పేలుస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఎప్పటికపుడు సమకాలీన సినీ, రాజకీయ అంశాలపై మాటల తూటాలు పేల్చే వర్మ, ఇటీవల తాను తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గౌరవానికి భంగం కలిగించేలా కొన్ని సీన్లు తీయడం జరిగిందని, కాబట్టి ఆ సినిమాను ఆంధ్రలో విడుదల కానివ్వబోమని అప్పట్లో టీడీపీ ఆ సినిమాను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. 

అంతేకాదు ఆపై సినిమా విడుదల కోసం వర్మ విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న సమయంలో వర్మను అడ్డగించడంతో ఆ రగడ మరింత ముదిరింది. ఇక ఆపై కొన్నాళ్ళకు ఎన్నికలు రావడం, ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలై వైసిపి అత్యధిక స్థానాల్లో గెలవడం జరిగిపోయాయి. ఆసమయంలో జగన్ నేతృత్వంలోని వైసిపి విజయాన్ని ఎంతో ఆనందంగా పొగుడుతూ వర్మ ఒక వీడియో సాంగ్ కూడా విడుదల చేసారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు టీడీపీ పై, చంద్రబాబు పై తనదైన స్టయిల్లో కౌంటర్ అటాక్ చేస్తున్న వర్మ, నేడు చంద్రబాబుపై మరొకసారి సెటైర్లు పేల్చారు. ఇదివరకు చంద్రబాబును చూస్తుంటే నవ్వొస్తోంది, 

సినిమాల్లో బ్రహ్మానందం మాదిరిగా అయన పరిస్థితి కామెడీగా తయారయిందని విమర్శించిన వర్మ, నేడు కూడా అదే విధంగా సెటైర్ వేస్తూ తన సోషల్ మీడియా ఖాతాల్లో కామెంట్ చేసారు. అసెంబ్లీలో టీడీపీ నాయకులు కామెడీ ట్రాక్ నడుపుతున్నారా? ఇక అదే అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన ప్రతిసారి సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు నవ్వుతున్న పరిస్థితిని చూసిన ప్రతిసారి, నాకు చంద్రబాబు మొహంలో సినిమాల్లోని బ్రహ్మానందం కామెడీనే కనపడుతోంది అంటూ జస్ట్ ఆస్కింగ్ పేరుతో నేడు ఆ పోస్ట్ చేసారు. ఇక వర్మ చేసిన ఈ పోస్ట్ పై టీడీపీ ఫాలోవర్స్ కొంతమంది విరుచుకుపడుతుండగా, మరికొందరు మాత్రం ఆయనను సమర్ధిస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: