విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా ఇదొక హిట్ పెయిర్ అనే చెప్పాలి. గ‌తంలో వీరిద్ద‌రూ న‌టించిన గీత‌గోవిందం సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. మ‌ళ్ళీ ఈ హిట్ పెయిర్ `డియ‌ర్ కామ్రేడ్‌`లో జ‌త‌క‌ట్టారు.  `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` ట్యాగ్ లైన్‌`. భ‌ర‌త్ క‌మ్మ దర్శ‌కుడు. ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజు   సినిమా ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో  విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ...


ప్రొడ్యూస‌ర్ న‌వీన్ మాట్లాడుతూ... ట్రైల‌ర్ అంద‌రూ చూశారా అంద‌రికీ న‌చ్చింది. ఎక్స్‌ట్రాడిన‌రీ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫోర్ సిటీస్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్ చేస్తున్నాం సినిమా చాలా బాగా వ‌చ్చింది. అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ యాష్ మాట్లాడుతూ... న‌వీన్‌గారు చెప్పిన‌ట్లే సినిమా చాలాబాగా వ‌చ్చింది. మీ అంద‌రి స‌పోర్ట్ చాలా అవ‌స‌రం. ఈ మూవీ ఫెస్టివ‌ల్ మూడ్ తీసుకువ‌స్తుంది. ఈ నెల 26న విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.


డైరెక్ట‌ర్ భ‌రత్ మాట్లాడుతూ.... మూడు ఏళ్ళ నుంచి జ‌రుగుతుంది. చాలా లాంగ్ జ‌ర్నీ. ఈ సినిమాకి సంబంధించి ముందు విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫాద‌ర్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ త‌ర్వాత ప్రొడ్యైస‌ర్స్ మైత్రీమూవీమేక‌ర్స్ అంద‌రీకీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.


ర‌ష్మిక మాట్లాడుతూ... ఈ క‌థ చాలా బావుంటుంది. క్రికెట్ విజువ‌ల్స్ కోసం 4నెల‌ల పాటు క్రికెట్ ట్రైయినింగ్ తీసుకున్నా. నేను ఈ చిత్రంలో న‌టిస్తున్నందుకు నాకు చాలా గ‌ర్వంగా ఉంది. ఇంత త్వ‌ర‌గా ఈ సినిమా అయిపోయిందంటే చాలా బాద‌గా కూడా ఉంది అని అన్నారు.


విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ... ఈ రోజు నాలుగు భాష‌ల్లో టీజ‌ర్ రిలీజ్ అయింది. చాలా ఆనందంగా ఉంది. ఒక వారం నుంచి నాకు స‌రిగా నిద్ర‌ప‌ట్ట‌డంలేదు. ఈ సినిమా కోసం చాలా ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నాను. ఒక సంవ‌త్స‌రం పాటు ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. కాబ‌ట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఈ చిత్రంలోని పాట‌లు నా కెరియ‌ర్‌లోనే బెస్ట్ ఆల్బ‌మ్ అని చెప్పాలి. అందుకే మ్యూజిక్ ఫెస్టివ‌ల్ని ఎరేంజ్ చేశాం. ఒక‌టి బెంగులూరులో 12వ తేదీన‌, కొచిన్‌లో 14న‌,  చెన్నైలో 18న ఆలాగే మ‌న హైద‌రాబాద్‌లో 19న ప్లాన్ చేశాం. అస‌లు కామ్రేడ్ అంటే అర్ధం ఏంటంటే స‌పోర్ట‌ర్స్ అని ఎవ‌రైనా ఏదైనా ప‌ని చేసే ముందు వాళ్ళ‌కు దొరికే స‌పోర్ట్‌ని కామ్రేడ్ అంటాం. ముఖ్యంగా నేను ఈ స్టేజ్ మీద ఉండ‌డానికి కార‌ణం మిలియ‌న్స్ ఆఫ్ పీపుల్ స‌పోర్ట్ వ‌ల్లే  ఇలా ఉన్నా అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: