తెలుగు ఇండస్ట్రీలో జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ తర్వాత దిల్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. నితిన్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటుతున్నా హీరోగా తన కెరీర్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. నితిన్ ఖాతాలో పెద్దగా హిట్స్ లేకపోయినా ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడీ నటిస్తున్నాడు.  అంతే కాదు మనోడు స్టిల్ బ్యాచ్ లర్.

గత ఏడాది `శ్రీనివాస క‌ల్యాణం` తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.   త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వెంకీ కుడుముల‌ రూపొందిస్తున్న `భీష్మ‌` సినిమాలో న‌టిస్తున్నాడు.  అయితే ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే  చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి, వెంకీ అట్లూరి సినిమాల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం `భీష్మ‌` షూటింగ్‌తో నితిన్ బిజీగా ఉన్నాడు.

అయితే ఇప్పటి వరకు భీష్మకు సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్ డేట్స్ లేవు అనుకుంటున్న సందర్భంలో ‘భీష్మ’కు సంబంధించిన ఓ స్టిల్ బయటకు వచ్చింది.  డీసెంట్ లుక్‌తో స్మార్ట్‌గా ఉన్న నితిన్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇక ఈ మూవి కథ విషయానికి వస్తే.. పెళ్లి అంటే ఇష్టం లేని ఓ కార్పొరేట్ ఉద్యోగి పాత్ర‌లో నితిన్ క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: