అమలా పాల్ హీరోయిన్ గా చేసిన ఆమె సినిమా రిలీజ్ కు ముస్తాబవుతోంది.  ఈ సినిమా గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.  అమలా నగ్నంగా నటించిన సీన్స్ టీజర్ ద్వారా ప్రపంచానికి తెలిసి నివ్వెరపోయారు.  అలాంటి సీన్స్ చేయడం అందరికి సాధ్యం కాదు.  ఎంతోధైర్యం కావాలి.  


ఏ మాత్రం అధైర్యపడ్డా సీన్ బాగా రాదు రచ్చ అవుతుంది.  ఆ సీన్ నటించే సమయంలో స్కిన్ షేడ్ డ్రెస్ లు ఉంటాయి.  వాటిని ధరించవచ్చని చెప్పారట.  అందుకు అమలా పాల్ ఒప్పుకోలేదు.  సీన్ సహజంగా రావాలి అంటే న్యూడ్ గా చేయాలని దర్శక నిర్మాతలకు ధైర్యం చెప్పింది.  


హీరోయిన్ ధైర్యం చెప్తే దర్శక నిర్మాతలకు వచ్చిన భయం ఏముంది.  ఒకే చెప్పారు.  అయితే, సీన్ చేసే సమయంలో ఆ షూటింగ్ స్పాట్ లో ఎవరెవరు ఉన్నారో ఎలా ఉంటారో అని భయం వేసిందట.  ఎందుకంటే ఎక్కువమంది ఉంది.. వారి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటె తప్పిదం జరిగిపోతుంది.  చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది.  


ఈ సీన్ చేసే సమయంలో నమ్మకమైన 15 మంది మాత్రమే సెట్స్ లో ఉన్నారని, వారి వద్ద సెల్ ఫోన్స్ తీసుకొని షూట్ చేశారని.  షూట్ అయిపోయాక తిరిగి ఇచ్చేశారని అమలా పాల్ చెప్పింది. సెలెబ్రిటీల నుంచి ప్రతి ఒక్కరు అమలా ధైర్యాన్ని మెచ్చుకున్నారు.  సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: