స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'కదరం కొండన్', తెలుగులో 'మిస్టర్ kk'గా రాబోతుంది. జూలై 19వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే విక్రమ్ కి హిట్ వచ్చి చాలా కాలం అయిపోయింది. సినిమాలు వస్తున్నయి వెళ్తున్నాయి తప్ప.. విక్రమ్ కి మాత్రం నిరాశే మిగులుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 'మిస్టర్ kk'గా రాబోతుంది. కానీ ఈ సినిమా జనానికి మాత్రం కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వలేదు. ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ కూడా లేవు.
అసలు ఈ స్టార్స్ సినిమాకి ఏమైంది..? ఇప్పటికైనా కమల్ - విక్రమ్ తమ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని వారి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి అభిమానుల కామెంట్లుకైనా ఈ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తారేమో చూడాలి. కాగా కమలహాసన్ హీరోగా తూంగావనం చిత్రాన్ని తెరకెక్కించిన రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా తెరెకెక్కింది. ఈ సినిమాలో విక్రమ్ తన శైలి యాక్టింగ్ తో ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నాడు. పైగా విక్రమ్ గెటప్ కూడా కొత్తగా ఉంటుందట. కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.