పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఈనెల 18 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది.  సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయని సమాచారం.  పూరి సాంగ్స్ ఎలా ఉన్నా మేకింగ్ సూపర్బ్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు.  


ఈ సినిమాను రీసెంట్ గా రామ్ చూశారు.  చూసిన తరువాత ఆయన చేసిన కామెంట్ సినిమాకు హైప్ క్రియేట్ చేశాడు.  ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ చూశాను.. దీనమ్మ కిక్కు!! ఈ క్యారెక్టర్ చేస్తూ.. ఆ పాత్రను స్క్రీన్ పై చూస్తూ వచ్చిన కిక్కు చాలా హై.  నాకు ఇలా కిక్కు ఇచ్చిన సినిమాను చూసి చాలాకాలం అయింది! థ్యాంక్ యు పూరి జగన్ గారు.  మీరే అసలు డ్రగ్ అని చాలామందికి తెలియదు.  అని ట్వీట్ చేశారు.  


సినిమా ఎలా ఉంటుంది అనే సంగతి పక్కన పెడితె.. హీరోలను పూరి చూపించే తీరు సూపర్బ్ గా ఉంటుంది.  రామ్ ను చాలా కొత్తగా ఎనేర్జిటిక్ గా ప్రజెంట్ చేశాడు.  అందుకే పూరితో సినిమాలు చేయడానికి హీరోలు ఇష్టపడుతుంటారు.  గతంలో బాలకృష్ణతో పైసా వసూల్ చేశాడు.  


ఇందులో బాలకృష్ణను చాలా కొత్తగా చూపించాడు.  బాలయ్యను అలా చూపిస్తారని ఎవరూ ఊహించలేదు. అంతకు ముందు మహేష్ ను పోకిరిలోను, బిజినెస్ మెన్ లోను ఏంటో ఎనేర్జిటిక్ గా చూపించాడు.  అంతెందుకు ఎన్టీఆర్ ను టెంపర్ లో చూపించిన తీరు అమోఘం అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: