“కేజిఎఫ్” సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ఈ సినిమాతో కన్నడంలో తెరకెక్కిన సౌత్ లో అనేక ఇండస్ట్రీలలో విడుదల చేసి రికార్డులు సృష్టించాడు. ఇదే క్రమంలో ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదల చేసి సౌత్ యొక్క దమ్ము ఏంటో ‘కే జి ఎఫ్’ తో నిరూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ విడుదలైన ప్రతి చోట దుమ్ము దులిపే విధంగా కలెక్షన్లు సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.


మాస్ ఆడియన్స్ కి విపరీతంగా ఈ సినిమా నచ్చింది. ఇటువంటి క్రమంలో మాస్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ వారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కోసం చర్చకు రాగా వారు తారక్ “కేజీఎఫ్” చిత్రాన్ని చూసి బాగా నచ్చిందని అందువల్ల ప్రశాంత్ తో ఒక సినిమా చేద్దామని అడిగారని తెలిపారు..దీనికి ప్రశాంత్ నీల్ కూడా అంగీకరించినట్టుగా తెలిపారని ఈ భారీ సెన్సేషన్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆఖరులో మొదలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.


మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. అయితే ఈ సినిమా రాజమౌళి సినిమా పూర్తయిన తర్వాత ఉంటుందని ఫిలింనగర్ టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: