ప్రస్తుతం నడుస్తున్న పోటీ వాతావరణంలో ఒక సినిమా ఆపోటీని తట్టుకుని నిలబడాలి అంటే చాలా డిఫెరెంట్ గా ప్రమోట్ చేయవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాలను పసిగట్టిన విజయ్ దేవరకొండ తన సినిమాల ప్రమోషన్ విషయంలో కూడడా చాలా డిఫెరెంట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ హీరోకి రాని ఐడియాలు ఇతడికి రావడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడ షాక్ అవుతున్నాయి. 

‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘ట్యాక్సీవాలా’ సినిమాలను విజయ్ ప్రమోట్ చేసిన తీరు కూడ ఆమూవీల ఘన విజయానికి సహకరించింది అన్న అభిప్రాయాలు కూడ గతంలో వ్యక్తం అయ్యాయి. ‘ట్యాక్సీవాలా’ సినిమా చూసేందుకు థియేటరుకు వచ్చిన ప్రేక్షకులందరికీ క్యాంటీన్‌ లో ఉచితంగా స్నాక్స్ ఇప్పించి అప్పట్లో ఒక కొత్త ట్రెండ్ కు ఈ యాంగ్ హీరో శ్రీకారం చుట్టాడు. ఇక లేటెస్ట్ గా ఈనెల విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ కోసం విజయ్ ఒక కొత్త యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసాడు.  

ఈ సినిమా దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ రిలీజవుతున్న సందర్భంలో డియర్ కామ్రేడ్ టీమ్ ఆ రాష్ట్రంలోని చాల ప్రముఖ నగరాలకు వెళ్ళి ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ పేరుతో ఈవెంట్లు చేయబోతున్నారు. బెంగళూరు చెన్నై కొచ్చి హైదరాబాద్ వైజాగ్ సిటీల్లో ఓపెన్ లొకేషన్ సినిమాలోని పాటలు ప్లే చేస్తూ డ్యాన్సులు చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తాడట విజయ్ దేవరకొండ. 

సాధారణంగా విజయ్ ని బయట చూస్తే చాలు పూనకంతో ఊగిపోతారు యూత్ అలాంటిది ఏకంగా ఓపెన్ గ్రౌండ్ లో యూత్ మధ్య విజయ్ డాన్స్ లు చేస్తే ఆ ఈవెంట్ కు వచ్చినవారికి ఏకంగా పూనకాలే వస్తాయి. ఇలాంటి ఈవెంట్స్ ను గతంలో కొంతమంది బాలీవుడ్ హీరోలు చేసారు. ఇప్పడు ఈ పద్ధతిని విజయ్ దక్షిణాది సినిమాల ప్రమోషన్ కు కూడ వాడుతున్నాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: