ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో పౌరాణిక సినిమాలు వచ్చాయి.  ఆ తరహా సినిమాలు తీయడానికి ఇప్పుడు దర్శక, నిర్మాతలు సాహసం చేయడం లేదు.  మారుతున్న కాలాన్ని బట్టి ఈ తరహా సినిమాలకు ఎక్కువ ఆదరణ కూడా లభించడం లేదు.  పౌరాణిక, జాన పద సినిమాలు తీయాలంలో ఎంతో సాహసం చేయాల్సిన వస్తుంది.  ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి 2’లాంటి జానపద సినిమాలు ఏ స్థాయిలో వచ్చాయో అందరికీ తెలిసిందే.

భారతీయ చలన చిత్ర రంగంలో ‘బాహుబలి’లాంటి మూవీ తీసి ఆ రికార్డు బ్రేక్ చేయాలని ఎంతో మంది చూసినా ఆదిలోనే అపశృతులు ఎదురు కావడంతో వెనక్కి తగ్గారు.  తాజాగా ఇప్పుడు తెరపైకి ‘బాహుబలి’ స్థాయిలో సినిమా నిర్మించాలని  సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా 'రామాయణ' పేరుతో మూడు భాగాలుగా ఈ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరింపజేయనున్నారు. 

ఆ మద్య మెహన్ లాల్ ముఖ్య పాత్రలో మహాభారతం తీయాలని ఆలోచన రావడం దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం జరిగింది..కానీ ఆ మూవీపై తర్వాత ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.  ఈ నేపథ్యంలో వెండితెరపై 'రామాయణం' మరోసారి దృశ్యకావ్యంగా ఆవిష్కృతం కానుంది. భారీ బడ్జెట్ తో తెలుగు,తమిళ, హిందీ భాషల్లో నిర్మితం కానుంది.

కాగా,  1500 కోట్లతో నిర్మితం కానున్న ఈ సినిమాలో 'సీత' పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా సమాచారం. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన  'శ్రీరామరాజ్యం' సినిమాలో 'సీత' పాత్రకి జీవం పోసి నయనతార మంచి మార్కులు కొట్టేసింది. మరి అంత బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార నటిస్తే ఇక తీరుగే ఉండదని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ గా ఏ ప్రకటన రాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: