అర్జున్ రెడ్డి సినిమా ట్రెండ్ సెట్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ మంచి అవకాశాలు రావడంతో కెరీర్ పరంగా ఒక స్టేజ్ కు వెళ్ళిపోయారు. కానీ హీరోయిన్ షాలిని పాండేకి అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి.   అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పాండేకి యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. 


ఆమె క్రేజ్ దృశ్య మొన్నటి వరకూ అవకాశాలు వచ్చాయి కానీ, అవి ఏమీ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పైగా ఆమె ధోరణి కారణంగానే ప్రస్తుతం ఆకాశాలు రావడం లేదని చెబుతున్నారు. ఆమె పాత్ర నడవిడి ఎక్కువగా ఉంటేనే సినిమాలను ఓకే చేస్తోందట... లేకపోతే మొహమ్మీదే నో చెప్పేస్తుందట.

అంతేకాదు ఆ పాత్రకు తగ్గట్టు ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందేననీ అంటోందట. దాంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎవరు ఆమె వైపు చూడటం లేదట అందుకే ఆమెకు అవకాశాలు తక్కువ వస్తున్నాయి అని అంటున్నారు. షాలినికి ఇండస్ట్రీలో నిలవాలంటే వచ్చిన పాత్రలకు న్యాయం చేయాలే తప్ప డిమాండ్ చేయకూడదు అన్న విషయం తెలుస్తుంతో తెలియదో చూాడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: