తెలుగు సినిమాలకు సంబంధించి అతిపెద్ద సీజన్ సంక్రాంతి. సంక్రాంతి వస్తుందంటే థియేటర్లలోకి మూడు నాలుగు సినిమాలు రావడం కామన్ అయిపోయింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అయినా కంటెంట్లో దమ్ముంటే పెద్ద సినిమాల కు పోటీగా వసూళ్లు రాబట్టి హిట్ అవుతున్నాయి. రెండేళ్ల క్రితం చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలయ్య శాతకర్ణి కి పోటీగా వ‌చ్చి మ‌రీ శర్వానంద్ శతమానంభవతి హిట్ అయ్యింది. 


అంతకు ముందు కూడా శ‌ర్వా డిక్టేట‌ర్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా, నాన్న‌కుప్రేమ‌తోకు పోటీ వ‌చ్చి ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర ఏకంగా నాలుగు సినిమాలు సందడి చేశాయి. వినయ విధేయ రామ - ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్లయి ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాయి. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని ‘ఎఫ్-2’ లాంటి యావరేజ్ మూవీ వసూళ్ల మోత మోగించుకుంది. ఐతే గత రెండు సంక్రాంతి సీజన్లతో పోలిస్తే వచ్చే ఏడాది వినోదం ఓ రేంజిలో ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.


ఇప్ప‌టికే మ‌హేష్‌బాబ స‌రిలేరు నీకెవ్వ‌రు, బ‌న్నీ - త్రివిక్ర‌మ్ మూవీ సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. బాలయ్య-కె.ఎస్.రవికుమార్ చిత్రం, మారుతి-సాయిధరమ్ తేజ్‌‌ల ‘ప్రతి రోజూ పండగే’ కూడా సంక్రాంతికే అంటున్నారు. ఇలాంటి భారీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల మ‌ధ్యలో రావ‌డం క‌న్నా... కాస్త గ్యాప్ ఇచ్చి వ‌స్తే మంచిది అంటున్నారు. ఇప్ప‌టికే వ‌రుస ప్లాపుల‌తో ఉన్న బాల‌య్య సంక్రాంతికి రావ‌డం క‌న్నా సంక్రాంతి సీజ‌న్ సినిమాల త‌ర్వాత మంచి టైం చూసుకుని త‌న సినిమాకు రిలీజ్ డేట్ పెట్టుకుంటే కాస్త మంచి వ‌సూళ్లు వ‌చ్చే ఛాన్స్ ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: