తాజాగా అమెరికాలో తెలుగు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జరిగే ఈ సమావేశాలకు ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళలో రాజకీయ, సినిమా రంగానికి చెందిన వాళ్లతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా తరలి వెళుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఆ సమావేశాలకు టాలీవుడ్లో ఓ సీనియర్ మోస్ట్ కమెడియన్ కూడా వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆ సంఘం వాళ్ళు ఆ కమెడియన్ కు ప్రత్యేకంగా సన్మానం ఏర్పాటు చేశారు.


ఈ సన్మాన కార్యక్రమం ముగిశాక వాళ్లు భారీగా పార్టీ ఇచ్చారట. ఈ పార్టీలో ఆ సంఘానికి చెందిన కొన్ని కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఆ సీనియర్ మోస్ట్ టాప్ కమెడియన్ అక్కడకు వ‌చ్చిన ఓ ఫ్యామిలీకి చెందిన మహిళతో తీవ్ర అసభ్యంగా ప్రవర్తించాడు అట. ఆ కాస్త మోడ్ర‌న్ డ్రెస్సుతో క‌మెడియ‌న్ ద‌గ్గ‌ర‌కు వచ్చే స‌రికి తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట.  


చివ‌ర‌కు ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవ్వ‌డంతో... నిర్వాహకులు ఆ మహిళా కుటుంబ సభ్యులను బ్రతిమాలి.. కేసు పెడితే లేనిపోని హంగామా అవుతుందని.. ఈ సారికి క్షమించి వదిలేయమని నచ్చ చెప్పారట. దీంతో ఆ టాప్ క‌మెడియ‌న్ బ‌తుకు జీవుడా ? అనుకుని బ‌య‌ట ప‌డ్డాడ‌ట‌. ఇంత‌కు ఎప్ప‌టి నుంచో సీనియ‌ర్ క‌మెడియ‌న్‌గా ఉన్న ఆయ‌న కామెడీ ఇటీవ‌ల పండ‌ట్లేదు. జ‌నాల‌కు  కూడా విసుగు వ‌చ్చేసింది. ఇక ఇంత‌కు ముందే స‌ద‌రు సీనియ‌ర్ క‌మెడియ‌న్ ఇలాంటి పిచ్చి ప‌నుల‌తో ప‌రువు పోగొట్టుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: