తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో తో అలరించిన యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని ఒకపక్క టెలివిజన్ రంగం మరోపక్క సినిమా రంగంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. జబర్దస్త్ కార్యక్రమం లో తన అందచందాలతో పొట్టి పొట్టి దుస్తులతో తెలుగు కుర్రకారును మత్తెక్కించిన యాంకర్ అనసూయ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో నటించి అద్భుతమైన పేరు సంపాదించుకున్నారు.


ఇటువంటి నేపథ్యంలో యాంకర్ గా నాగార్జున వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్-3 లో నటించాలని షో నిర్వాహకులు అనసూయ కి భారీగా ఆఫర్ చేయగా..షో నిర్వాహకులు ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించినట్లు సమాచారం. దీనికి కారణం తాను ఒప్పుకున్న సినిమాలని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. ఒకవేళ బిగ్‌బాస్ హౌస్‌‌లో వెళితే మొత్తంగా 100 రోజులు ఉండాల్సి వస్తోంది.


మధ్యలో మిడిల్ డ్రాప్ అయినా ఎంత లేదన్న 50 రోజులు అయినా ఉండాలి.ఇప్పటికే చాలా సినిమాలతో పాటు వేరే ఈవెంట్స్‌కు అన్నింటికీ అనసూయ ముందుగానే అడ్వాన్సులు తీసుకుంది. ఈ పరిణామంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడితే తన కెరియర్ కె ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్న క్రమంలో యాంకర్ అనసూయ బిగ్ బాస్ 3 ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: